Posts

భాగ్సా ఉత్సవం

Image
ధనుర్మాసం సందర్భంగా భక్త సులభుడైన ఆ శ్రీనివాసుని తలచుకుందామని  ఓ చిన్న ప్రయత్నం ఈ కధ.             అనంతాళ్వారులను తెలియని వారు ఉండరు. ఆ గోవిందుని భక్త పరంపరలో ఒకరు వారు. వారు తన భార్యతో  కలిసి ఎంతో కష్టపడి రామానుజ పుష్పవాటికలో ఎన్నో రకాల పూలచెట్లను నాటి రక రకాల పూలు పూయించారు. వాటినుంచి మంచి పూలను సేకరించి దండ కూర్చి స్వామి వారికి సమర్పించేవారు. స్వామి వారికి ఆ మాలలు బాగా నచ్చాయి.              ఈ మాలలే ఇంత అందంగా ఉంటే వీటిని పూయించే తోట ఇంక ఎంత అందంగా ఉందో చూడాలనిపించింది స్వామి వారికి. ఆరోజు అర్చకులు బంగారు వాకిళ్ళను మూసివేసి వెళ్ళిపోయాక స్వామి అలమేలు మంగమ్మ తో కలిసి ఆ తోట చూడటానికి వెళ్ళారు. ఆ తోటను అందులోని పూలను చూసాక పరవశించిపోయారు .తోటంతా తిరుగుతూ సరససల్లాపాలతో గడిపారు. ఆ పూల సువాసనకు పులకరించి కొన్ని పూలు వాసన చూసి పడేయడం, కొన్ని పూలు అమ్మవారి శిగలో తురమటం ఇలా చేస్తూ సుప్రభాతం వేళకి ఆనందనిలయం చేరుకున్నారు.             తెల్లవారాక పూలు కోద్దామని తోటకు వెళ్లిన ...

అమర్నాథ్ యాత్ర

Image
                 ఈమధ్య జరిగిన అమర్నాథ్ యాత్ర కు మా అల్లుడు గారు వెళ్ళారు .  ఎంతో ప్రశాంతంగా జరిగింది యాత్ర. నాకు  వెళ్ళాలని ఉన్నా ఆరోగ్యం సహకరించక వెళ్ళలేదు .   కాశ్మీర్ భూతల స్వర్గం అని ఎందుకు అంటారో శ్రీనగర్ చూస్తే    అర్థం అవుతుంది .  చుట్టూ ఎత్తైన మంచు కొండలు సూర్యోదయ వేళలో బంగారు రంగులో, మధ్యాహ్నం వేళ తెల్లగా, సాయంత్రం వేళకి నీలి రంగు లోకి మారి కనువిందు చేస్తాయి .  దారి ప్రక్కనే గల గలా పారుతున్న నదిలో    నీరు తెల్లని పాల నురగలాటుంది .  ప్రశాంతమైన వాతావరణంలో నదిలో పారుతున్న నీటి సవ్వడిని వింటుంటే మనసు లోని దిగుళ్ళన్నీ మాయమైపోయి ఎంతో హాయిగా ఉంటుంది .  ఆ మంచు కొండల పైనుంచి కిందికి దూకే జలపాతాన్ని చూస్తే శివుని జటాఝూటం  నుంచి దూకే గంగలా అనిపించకమానదు .  దూరంగా చూస్తే బారులు తీరిన సైనికుల్లా దేవదారు చెట్లు చూసేందుకు ఎంతో బాగుంటాయి .  దాల్ సరస్సు లో చిన్న పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగిన ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది .  ఫ్లోటింగ్ గార్డెన్స్ ఉంటాయి మధ్య మ...

సర్దుబాటు

Image
                        హాయ్ వల్లీ..........అంటూ నా ప్రాణ స్నేహితురాలిని పలుకరిస్తూ లోపలికి వెళ్ళా. హాల్లో లేదు ఎక్కడుందబ్బా అనుకుంటూ  దొడ్లో కి వెళ్తే అక్కడ కూర్చుని ఉంది. నేను పిలిచినా వినిపించనంత ఆలోచన లో ఉంది. దగ్గరకెళ్ళి భుజం తట్టగానే ఉలిక్కిపడి ఆఁ అంటూ లేచింది. ఏంటే అంటే ఇపుడే పక్కింటి ఆవిడ వచ్చి తన బాధలు చెప్పుకుని వెళ్ళిందని.. ఆవిడ కొడుకూ కోడళ్ళ మధ్య ఏవో గొడవలనీ, విడాకులు తీసుకునేదాక వచ్చిందని బాధ పడిందట. ఏంటో రోజులు ఇలా అయిపోయాయి అని ఆలోచిస్తూ ఉండిపోయిందట. నిజానికి పరిస్థితులు అలాగే ఉన్నాయి. పక్కింటావిడ సమస్యే కాదు ఎక్కడ చూసినా ఇలాగే ఉంది వాతావరణం.                       మొన్నీమధ్య ఓ పుస్తకం లో ఓ చిన్న కధ చదివాను. ఓ భార్య భర్త ఉంటారు, భర్త ఎపుడూ ఆమె కి సహాయం చేయటం కానీ, ఆమెను అర్థం చేసుకోవటం కానీ జరగలేదు. అలా కొన్నేళ్లు జరిగిన తరువాత ఆమెకు జబ్బు చేస్తుంది. ఎక్కువ కాలం బ్రతకదని డాక్టర్లు చెప్తారు . వాళ్ళింట్లో అన్ని వస్తువులు ఆయనకు తెలిసినవే కానీ, అటక మ...

మా చిన్నతనం

Image
వేసవికాలం...                         పిల్లలకు సెలవులు ఇచ్చేసారు. ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడో కొంత మంది తప్ప ఎక్కువ మంది పల్లెలకు వెళ్ళలేకపోతున్నారు. సమ్మర్ క్యాంపులు అని, ఏవో కోచింగులు అని, తల్లిదండ్రుల ఉద్యోగాల వల్ల సెలవులు లేకపోవటం, ఇలా ఎన్నో కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నారు.  అలా వెళ్ళటం వలన ఎంతొ ఆనందం పొందుతారు కానీ చాలా మంది కి కుదరటం లేదు . అదే మా చిన్నతనంలో అయితే  సెలవుల కోసం ఎదురు చూసేవాళ్ళం. మాది ఓ చిన్న పల్లెటూరు. పేరు సిద్ధనకొండూరు. అందరూ వచ్చారంటే ఇక సందడే సందడి. తాటికాయల కాలం కదా! ముంజలకి కొదవే లేదు.. తెగ తినేవాళ్ళం. ఇప్పట్లా ముంజె చేతికిచ్చేవారు కాదు. కాయను కోసి ఇస్తే వేలితో తీసి తినేవాళ్ళం. భలే మజా ఉండేది అలా తినటంలో.  అలాగే ఈతకాయలు తినటంలోనూ ఎంతో సరదా ఉండేది.  పెద్ద నేల బావులు ఉండేవి తోటల్లో.  నీళ్ళలో మునిగి పోకుండా మునగ కట్టెలు నడుము కి కట్టుకుని ఆ బావుల్లో ఈత కొట్టేవారు మగపిల్లలు. ఆడపిల్లలను పంపేవారు కాదు .               మావూ...

నా తిరుమల ప్రయాణం

Image
                    మా చిన్న   మనవరాలికి పుట్టువెంట్రుకలు తీయించాలని మా కుటుంబం అంతా కలిసి బెంగళూరు నుంచి ఉదయం 5.30 గంలకు కారులో బయలుదేరాము . హొసకోట దాటేసరికి సూర్యోదయం అయింది . ఎంత బాగుందో అనుకుంటూ వెళ్తూంటే దారికిరుప్రక్కల ద్రాక్ష తోటలు , బంతి పూల తోటలు , కూరలతోటలు కనువిందు చేస్తూ కనిపించాయి . చెప్పొద్దూ ... కాస్త ఆగి మమ్మల్ని చూసి వెళ్ళండి అని పిలిచినట్టే   అనిపించింది నాకు . ఇక పిల్లలు చెప్పాలా .. దిగేశాం . ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం . ఆ తోటలు చూసి బాగా ఆనందించాం అందరం . నగరాల్లో ఉంటున్న మనకు ఇలాంటి అవకాశం ఎపుడో కాని రాదు . ఇంతకుముందు అమ్మమ్మ నాన్నమ్మల ఊళ్ళకు వెళ్ళేవాళ్ళం . ఈ రోజుల్లో మన అవసరాలకు వాళ్ళను ఇక్కడి కి తీసుకొని వచ్చేస్తున్నాము ఇక ఊళ్ళకు ఏం వెళ్తాం . అలా కాసేపు గడిపి మళ్ళీ ప్రయాణం మొదలెట్టాము .                                           11 గం లకు శ్రీనివాసమంగాపురం చేరుకున్నాము . పెద్ద ...

పెరటి మొక్క

Image
మిత్రులందరికీ నమస్కారం.....                                   చాలాకాలం అయింది నా మనసు లో మాట మీతో కలిసి పంచుకుని. ఏంటో మనిషి జీవితం సమస్యలపుట్ట అవుతోంది. సమస్య లేని మనిషే లేడనిపిస్తోంది. కొన్ని సార్లు మన బాధని ఎవరికీ చెప్పలేము కూడా. అలాంటప్పుడు మన అంతరాత్మే మనకు మంచి చెడు చెప్పే స్నేహితుడు అవుతుంది. కానీ మన మనసు వినదు, ఎవరికీ చెప్పలేము. ఎవరికైనా చెప్తే ఎక్కడ అయ్యో పాపం అంటారో అని భయం. సానుభూతిని భరించటం చాలా కష్టం. సానుభూతి కన్నా చావు మేలు ‌అనేది పెద్దల మాట. నేను పెద్ద సమస్య తో బాగా కుంగిపోయాను. ఎలా బయటకు రావడం అర్థం కాలేదు.  మాఇంట్లో చిన్న పూలమొక్కలు పెంచుతూ ఉంటాను. రోజూ కాసేపు వాటిని చూస్తూగడుపుతా ఎంతో హాయిగా ఉంటుంది.  ఉన్నట్టుండి ఒక రోజు ఒక మొక్కవాడిపోవటం మొదలైంది. ఎందుకు అని ఆలోచించి నీళ్ళు పోసా అయినా సరికాలేదు. కొంచెం మొక్కలకు వేసే మందు వేసా అంతే పక్క రోజుకి మామూలుగా అయింది.   అపుడు అనిపించింది ఏదైనా సరే విషయం తెలుసుకుంటే సరైన మందు వేస్తే అన్నింటికీ పరిష్కారం...
"తృప్తి".                                    (గెలిచిన పందెం) గుర్రాన్ని అమ్మడానికి వేటగాడు సంతకు వెళ్ళాడు. బేరం కుదరక గుర్రాన్ని ఇచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిద కు మారకం వేశాడు. అదీ కుదరక గాడిదనిచ్చి బూట్లు కొన్నాడు. అదీ కుదరక బూట్లు ఇచ్చి టోపీ కొన్నాడు. ఆ టోపీ తో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తూ ఉంటే రాయి తగిలి బోర్లా పడ్డాడు. టోపీ కాస్తా నది లో పడిపోయింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే బాటసారులు విషయం అడిగి తెలుసుకుని అయ్యో పాపం అని బాధ పడ్డారు. " నీకివాళ ఉపవాసమే " అన్నాడొకడు. పెళ్ళాం చేత " బడితే పూజ" తప్పదన్నాడింకొకడు. వేటగాడు నా భార్య అలాంటిది కాదు, ఏమీ అనదు అని బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురూ వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మం లోంచి భార్య ని పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా వచ్చావా అంది ఆప్యాయంగా. వాడు జరిగింది చెప్పటం మొదలెట్టాడు. వేటగాడు: గుర్రం ధర పలకకపోతే ఆవు కు మారకం వేశా అన్నాడు. భార్య: మంచి పని చేసావు పాలు...