పెరటి మొక్క
మిత్రులందరికీ నమస్కారం.....
చాలాకాలం అయింది నా మనసు లో మాట మీతో కలిసి పంచుకుని. ఏంటో మనిషి జీవితం సమస్యలపుట్ట అవుతోంది. సమస్య లేని మనిషే లేడనిపిస్తోంది. కొన్ని సార్లు మన బాధని ఎవరికీ చెప్పలేము కూడా. అలాంటప్పుడు మన అంతరాత్మే మనకు మంచి చెడు చెప్పే స్నేహితుడు అవుతుంది. కానీ మన మనసు వినదు, ఎవరికీ చెప్పలేము.
ఎవరికైనా చెప్తే ఎక్కడ అయ్యో పాపం అంటారో అని భయం. సానుభూతిని భరించటం చాలా కష్టం. సానుభూతి కన్నా చావు మేలు అనేది పెద్దల మాట. నేను పెద్ద సమస్య తో బాగా కుంగిపోయాను. ఎలా బయటకు రావడం అర్థం కాలేదు.
మాఇంట్లో చిన్న పూలమొక్కలు పెంచుతూ ఉంటాను. రోజూ కాసేపు వాటిని చూస్తూగడుపుతా ఎంతో హాయిగా ఉంటుంది. ఉన్నట్టుండి ఒక రోజు ఒక మొక్కవాడిపోవటం మొదలైంది. ఎందుకు అని ఆలోచించి నీళ్ళు పోసా అయినా సరికాలేదు. కొంచెం మొక్కలకు వేసే మందు వేసా అంతే పక్క రోజుకి మామూలుగా అయింది.
అపుడు అనిపించింది ఏదైనా సరే విషయం తెలుసుకుంటే సరైన మందు వేస్తే అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది అనిపించింది. సమస్య పక్కనే పరిష్కారం ఉంటుంది. కాకపోతే ఆలోచన అంతా బాధ వైపు ఉంటుంది కాబట్టి కనపడదు. కొంచెం శాంతంగా ఆలోచించితే అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది.
అందుకే ఏదీ కూడా సమస్యగా భావించకూడదు.అలా భావిస్తే మనసు ఆందోళనకు గురి అవుతుంది.సమస్యకు పరిష్కార మార్గము చూడడము తెలివైన పని.☺👍
ReplyDelete👌
ReplyDelete