"తృప్తి".
(గెలిచిన పందెం) గుర్రాన్ని అమ్మడానికి వేటగాడు సంతకు వెళ్ళాడు. బేరం కుదరక గుర్రాన్ని ఇచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిద కు మారకం వేశాడు. అదీ కుదరక గాడిదనిచ్చి బూట్లు కొన్నాడు. అదీ కుదరక బూట్లు ఇచ్చి టోపీ కొన్నాడు. ఆ టోపీ తో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తూ ఉంటే రాయి తగిలి బోర్లా పడ్డాడు. టోపీ కాస్తా నది లో పడిపోయింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే బాటసారులు విషయం అడిగి తెలుసుకుని అయ్యో పాపం అని బాధ పడ్డారు. " నీకివాళ ఉపవాసమే " అన్నాడొకడు. పెళ్ళాం చేత " బడితే పూజ" తప్పదన్నాడింకొకడు. వేటగాడు నా భార్య అలాంటిది కాదు, ఏమీ అనదు అని బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురూ వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మం లోంచి భార్య ని పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా వచ్చావా అంది ఆప్యాయంగా. వాడు జరిగింది చెప్పటం మొదలెట్టాడు. వేటగాడు: గుర్రం ధర పలకకపోతే ఆవు కు మారకం వేశా అన్నాడు. భార్య: మంచి పని చేసావు పాలు తాగవచ్చు అన్నది. వేటగాడు ఆవును గాడిద కు మారకం వేశా అన్నాడు.భార్య : పోనీలే అడవి నుంచి కట్టెలు తెచ్చుకోవచ్చు అంది. వేటగాడు: గాడిద ను అమ్మేసి బూట్లు కొన్నా అన్నాడు. భార్య: అడవి లో రాళ్ళు తగలకుండా ఉంటాయి లే అంది. వేటగాడు అవీ ఉంచుకోకుండా అమ్మేసి టోపీ కొన్నా అన్నాడు. భార్య: ఆ టోపీ తో నువ్వు అందంగా ఉంటావు అంది తృప్తి గా. వేటగాడు: కానీ వస్తావుంటే నేను వంతెన మీద నడుస్తూ కింద పడితే టోపీ నీళ్ళలో పడిపోయింది అన్నాడు. భార్య: పోయే నీవు పడకుండా వచ్చావు , అంతా ఆ అడవి తల్లి దయ అని ముద్దు పెట్టింది. నేడు ఇలాంటి సంభాషణ వినగలమా! ప్రస్తుతం మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార బంధాలే.
నిజమే, చిన్న బైక్ కొన్నవాడు పెద్ద బైక్ కొనాలనుకుంటాడు. చిన్న కారు ఉన్నవాడు పెద్ద కారుంటే బాగుంటుంది అనుకుంటాడు. రెండు పడకగదుల ఇల్లు ఉన్నవాడు ఇంకో గది ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు బాగుంటుంది అనుకుంటాడు.కోరికలు ఉండాలి కానీ మితిమీరకూడదు. పచ్చడి అన్నం తినేవాడు పంచభక్ష్యాలకు ఆశపడితే దొరుకుతుందా? ఒకవేళ దొరికినా ఎన్నో విలువైన క్షణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. గడిచిన కాలం తిరిగి రాదు కదా.... అందుకే పెద్దలు అన్నారు , "తృప్తి కి మించిన ఆనందం లేదు, ఆనందానికి మించిన ఔషధం లేదు" అని. చిన్న చిన్న వాటికే తృప్తి పడగలిగితే జీవితం అంతా ఆనందమే .

Chla bagundi
ReplyDeleteChala bagundi attaiah,nizame eppati paristitulu alane vunnai
ReplyDelete