మా చిన్నతనం
వేసవికాలం...
పిల్లలకు సెలవులు ఇచ్చేసారు. ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడో కొంత మంది తప్ప ఎక్కువ మంది పల్లెలకు వెళ్ళలేకపోతున్నారు. సమ్మర్ క్యాంపులు అని, ఏవో కోచింగులు అని, తల్లిదండ్రుల ఉద్యోగాల వల్ల సెలవులు లేకపోవటం, ఇలా ఎన్నో కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నారు. అలా వెళ్ళటం వలన ఎంతొ ఆనందం పొందుతారు కానీ చాలా మంది కి కుదరటం లేదు .
అదే మా చిన్నతనంలో అయితే సెలవుల కోసం ఎదురు చూసేవాళ్ళం.
మాది ఓ చిన్న పల్లెటూరు. పేరు సిద్ధనకొండూరు. అందరూ వచ్చారంటే ఇక సందడే సందడి.
తాటికాయల కాలం కదా! ముంజలకి కొదవే లేదు.. తెగ తినేవాళ్ళం. ఇప్పట్లా ముంజె చేతికిచ్చేవారు కాదు. కాయను కోసి ఇస్తే వేలితో తీసి తినేవాళ్ళం. భలే మజా ఉండేది అలా తినటంలో. అలాగే ఈతకాయలు తినటంలోనూ ఎంతో సరదా ఉండేది.
పెద్ద నేల బావులు ఉండేవి తోటల్లో. నీళ్ళలో మునిగి పోకుండా మునగ కట్టెలు నడుము కి కట్టుకుని ఆ బావుల్లో ఈత కొట్టేవారు మగపిల్లలు. ఆడపిల్లలను పంపేవారు కాదు .
మావూళ్ళో ఓ చిన్న కొండ, దానిమీద శివాలయం ఉంది. ఆ ఆలయం ఎన్నేళ్ళ క్రితందో తెలీదు కానీ మా నాన్నగారికి పాతిక సంవత్సరాల వయస్సు లో ఆ ఆలయం పునరుద్ధరణ జరిగినట్టుగా చెప్పేవారు. ఆ కొండ ఎక్కడానికి మెట్లు ఉండేవికావు అయినా ఆ తుప్పల్లో, రాళ్ళల్లో అలాగే ఎక్కి వెళ్ళేవాళ్ళం.దారిలో రేగుపండ్లు, కలేకాయలుకోసుకుని తినేవాళ్ళం. వెళ్ళేముందే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏవంటే అవి తినోద్దు, వాంతులై పడిపోతారు అని. అయినా వినేవాళ్ళం కాదు, దారిలో ఏవేవో చెట్లు వాటికి పండ్లు ఉండేవి.అవి కోసి రుచి చూసేది బాలేదని పడేసేది. అలా కొండమీదకు వెళ్ళేవాళ్ళం. అంత కష్టపడ్డా ఎంతో ఆనందంగా ఉండేది.
శివయ్యకు దణ్ణం పెట్టుకొని ఇవతలికి వస్తే అక్కడ రావి చెట్టు, వేపచెట్టు ఉన్నాయి, వాటికి కల్యాణం జరిపిస్తే అశ్వధ్ధనారాయణ, మహాలక్ష్మి కి కల్యాణం జరిగినట్లు అని చెప్తారు కదా పెద్దలు, అక్కడ దణ్ణం పెట్టుకొనే వాళ్ళం . ఇప్పటికీ మనం ఆ చెట్లను చూడచ్చు.
పిల్లలకు సెలవులు ఇచ్చేసారు. ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడో కొంత మంది తప్ప ఎక్కువ మంది పల్లెలకు వెళ్ళలేకపోతున్నారు. సమ్మర్ క్యాంపులు అని, ఏవో కోచింగులు అని, తల్లిదండ్రుల ఉద్యోగాల వల్ల సెలవులు లేకపోవటం, ఇలా ఎన్నో కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నారు. అలా వెళ్ళటం వలన ఎంతొ ఆనందం పొందుతారు కానీ చాలా మంది కి కుదరటం లేదు .
అదే మా చిన్నతనంలో అయితే సెలవుల కోసం ఎదురు చూసేవాళ్ళం.
తాటికాయల కాలం కదా! ముంజలకి కొదవే లేదు.. తెగ తినేవాళ్ళం. ఇప్పట్లా ముంజె చేతికిచ్చేవారు కాదు. కాయను కోసి ఇస్తే వేలితో తీసి తినేవాళ్ళం. భలే మజా ఉండేది అలా తినటంలో. అలాగే ఈతకాయలు తినటంలోనూ ఎంతో సరదా ఉండేది.
శివయ్యకు దణ్ణం పెట్టుకొని ఇవతలికి వస్తే అక్కడ రావి చెట్టు, వేపచెట్టు ఉన్నాయి, వాటికి కల్యాణం జరిపిస్తే అశ్వధ్ధనారాయణ, మహాలక్ష్మి కి కల్యాణం జరిగినట్లు అని చెప్తారు కదా పెద్దలు, అక్కడ దణ్ణం పెట్టుకొనే వాళ్ళం . ఇప్పటికీ మనం ఆ చెట్లను చూడచ్చు.
superb memories pinni.నాకు బాగా గుర్తు నీకు పెళ్లి అయిన తరువాత మొదటి సారి హుబ్లీ నుండి siddanakonduru వచ్చావు. ఆ టైంలో నేను కూడా siddanakonduru వచ్చాను. అదే కాకుండా నీ పెళ్లికి వచ్చినపుడు అక్కడ ఊర్లో పిల్లలతో కర్ర బిళ్ళ ఆడడము నేర్చుకున్నా.అపుడు నాతో ఆడిన పిల్లలలో ఒకరిని కర్ర బిళ్ళ చేసి ఇవ్వమన్నాను.అందుకు బదులుగా మీ పెళ్లిమీ చేసిన లడ్డు, బూందీ ఇచ్చాను. ఆ రోజులే రోజులే. ఈ కాలము పిల్లలకు ఆ ఆనందాలు కరువు అయ్యాయి.
ReplyDeleteThanks pradeep
DeleteHi pinni Chala baaga raasaru nenu koda vellanu mee village ki temple ki koda Vella I think 1 year ago anukunta akkada Chala baguntadi Chala prasantanga tq Malli avanni gurtutechinanduku
DeleteThanks
DeleteSuper andi nijamgaane aa rojule rojulu ammamma chethi vanta thaathayya kathalu menamaama muchatlu anni.
ReplyDeleteSweet memories
Pinni chala bagundi nijam ga nenu perigindi aa oorlo kada naku gurtu undi chala bagundedi
ReplyDeleteSuper pinni.. manchi childhood memories anni konni paragraphs lo rasavu.. Excellent.
ReplyDelete