భాగ్సా ఉత్సవం
ధనుర్మాసం సందర్భంగా భక్త సులభుడైన ఆ శ్రీనివాసుని తలచుకుందామని ఓ చిన్న ప్రయత్నం ఈ కధ.
అనంతాళ్వారులను తెలియని వారు ఉండరు. ఆ గోవిందుని భక్త పరంపరలో ఒకరు వారు. వారు తన భార్యతో కలిసి ఎంతో కష్టపడి రామానుజ పుష్పవాటికలో ఎన్నో రకాల పూలచెట్లను నాటి రక రకాల పూలు పూయించారు. వాటినుంచి మంచి పూలను సేకరించి దండ కూర్చి స్వామి వారికి సమర్పించేవారు. స్వామి వారికి ఆ మాలలు బాగా నచ్చాయి.
ఈ మాలలే ఇంత అందంగా ఉంటే వీటిని పూయించే తోట ఇంక ఎంత అందంగా ఉందో చూడాలనిపించింది స్వామి వారికి. ఆరోజు అర్చకులు బంగారు వాకిళ్ళను మూసివేసి వెళ్ళిపోయాక స్వామి అలమేలు మంగమ్మ తో కలిసి ఆ తోట చూడటానికి వెళ్ళారు. ఆ తోటను అందులోని పూలను చూసాక పరవశించిపోయారు .తోటంతా తిరుగుతూ సరససల్లాపాలతో గడిపారు. ఆ పూల సువాసనకు పులకరించి కొన్ని పూలు వాసన చూసి పడేయడం, కొన్ని పూలు అమ్మవారి శిగలో తురమటం ఇలా చేస్తూ సుప్రభాతం వేళకి ఆనందనిలయం చేరుకున్నారు.
తెల్లవారాక పూలు కోద్దామని తోటకు వెళ్లిన అనంతాచార్యులు ఆశ్చర్యపోయారు. ఎటుచూసినా తుంపేసిన కొమ్మలు, పూలు, వుమ్మిన తమలపాకు చారలు కనిపించాయి. ఎవరో దొంగ వెధవలు ఇలా చేసారనిపించి చాలా కోపమొచ్చింది. ఎలా అయినా వాళ్ళను పట్టుకోవాలనుకుని ఇక ఈరోజు నుంచి రాత్రి పూట కావలి ఉండాలి లేకపోతే పూల కైంకర్యం ఆగిపోతుంది అనుకుని కంటికి కునుకు లేకుండా కాపలా ఉన్నారు. అయినా ఆయన కన్ను కప్పి పూలను తెంచుతూనేఉన్నారు.

ఇలా వారం రోజులు గడిచాయి. అనంతాచార్యులు మా గురువుగారి కోరిక మేరకు జరిగే పూలమాల కైంకర్యం ఆగిపోకుండా చూడండి స్వామి అనుకుని మరుసటిరోజు కూడా చెట్టు మాటున నక్కి చూడసాగాడు. ఆ గోవిందుడు భక్తసులభుడు కదా ఆచార్యుల భక్తి లోకానికి తెలియచేయాలనుకున్నాడు. ఆ రాత్రి కొంత సేపటికి అనంతాచార్యుల వారికి తులసి పొదల మాటున రెండు ఆకారాలు కదులుతూ కనిపించాయి. వారు ఆడ మగ అని అర్థం అయింది. వారు మంచి వర్చస్సు కలవారిగా అనిపించింది. వారినుంచి మంచి సువాసన కూడా వచ్చింది.
ఎవరా వీరు అనుకుని ,ఎవరైతే నాకేంటి.. నా తోటను పాడుచేస్తున్నారు వీళ్ళను పట్టుకోవాలి అని వెళ్ళి గబుక్కున పట్టుకున్నాడు. ఎలాగో పెనుగులాడి పురుషుడు తప్పించుకున్నాడు. ఆవిడ మాత్రం దొరికింది. ఆయన ఆవిడతో మీ సరసాలకు నా తోటే దొరికిందా , సాక్షాత్తూ ఆ శ్రీనివాసుని కైంకర్యానికి వాడే పువ్వులు పాడు చేస్తారా అంటూ ఆవిడను అక్కడే ఉన్న సంపెంగ తీగతో చెట్టుకు కట్టేసాడు. ఆవిడ అనంతాచార్యులవారిని నీ బిడ్డ లాంటిదాన్ని నన్ను వదిలేయండి నేను వద్దంటున్నా నా మగడే ఈ తోట చాలాబాగుంటుంది అంటూ తీసుకువచ్చాడు దయచేసి నన్ను పోనివ్వండి అంటూ బ్రతిమాలుకుంది ఆ తల్లి.

ఆయన వదలక ఆ పురుషుడి కోసం బయట అంతా వెతికాడు. అతను బయట తచ్చాడటం చూసి ఆయన వెంటపడ్డాడు అనంతాచార్యులు. ఆయన ఆలయం ఆవరణలో అప్రదక్షిణంగా దక్షిణ మాడవీధిలో నుంచి అన్ని మాడవీధులలో పరిగెత్తుతూ అదృశ్యం అయ్యాడు. ఆచార్యులవారు తోటదగ్గరకు వచ్చారు. మళ్ళీ ఆవిడ నన్ను వదలమని వేడుకుంది. రేపు పొద్దున చూద్దాం అంటూ ఆయన నిద్రపోయారు. తెల్లవారాక అర్చక స్వాములు స్వామివారిని మేల్కొలపటానికి వెళ్ళి స్వామివారి వక్షస్థలం మీద అమ్మవారి ప్రతిమ కనపడకపోవటంతో కలవరపడ్డారు. అపుడు స్వామి భయపడకండి ఆవిడ అనంతాచార్యుల తోటలో బంధింపబడి ఉంది మీరు వెళ్ళి సగౌరవంగా ఆమెను తీసుకురండి అని పలికారు. అపుడు వారు మంగళవాద్యాలతో తోటకు వెళ్ళి అనంతాచార్యులను నువ్వెంత భాగ్యశీలివయ్యా సాక్షాత్తు ఆ అలమేలుమంగమ్మనే బంధించావే అన్నారు. అది విన్న ఆచార్యులవారు అయ్యో ఎంత తప్పుచేసాను అని చెంపలు వేసుకుని అమ్మవారికి సాష్టాంగనమస్కారం చేసి ఆమెను ఒక పూల గంపలో కూర్చోపెట్టుకుని ఆలయానికి తీసుకువచ్చారు.
అలా వచ్చిన ఆచార్యులను స్వామివారు మామా అంటూ పిలిచి నీ కూతురును పూల గంపలో తెచ్చి నాకు సమర్పిస్తున్నందున కన్యాదాతవయ్యావు అన్నారు. యధాప్రకారం అమ్మవారు బంగారు ప్రతిమ అయ్యి స్వామివారి వక్షస్థలాన్ని అలంకరించింది. వస్త్ర చందన తాంబూలాలతో శ్రీనివాసుడు ఆచార్యులవారిని సత్కరించాడు. ఆనాటి ఆ దివ్యగాధను తలచుకుంటూ ఇప్పటికీ బ్రహ్మో త్సవాలలో స్వామివారు అప్రదక్షిణంగా ఆచార్యులవారి తోటకు వెళ్ళివస్తారు. ఈ ఉత్సవాన్ని భాగ్సా ఉత్సవం అంటారు
. ఓం నమో నారాయణాయ.
. ఓం నమో నారాయణాయ.
Chala bagundi
ReplyDeleteThank you
ReplyDelete