నా తిరుమల ప్రయాణం
మా చిన్న మనవరాలికి పుట్టువెంట్రుకలు తీయించాలని మా కుటుంబం అంతా కలిసి బెంగళూరు నుంచి ఉదయం 5.30గంలకు కారులో బయలుదేరాము. హొసకోట దాటేసరికి సూర్యోదయం అయింది. ఎంత బాగుందో అనుకుంటూ వెళ్తూంటే దారికిరుప్రక్కల ద్రాక్ష తోటలు, బంతి పూల తోటలు, కూరలతోటలు కనువిందు చేస్తూ కనిపించాయి. చెప్పొద్దూ... కాస్త ఆగి మమ్మల్ని చూసి వెళ్ళండి అని పిలిచినట్టే అనిపించింది నాకు. ఇక పిల్లలు చెప్పాలా.. దిగేశాం. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఆ తోటలు చూసి బాగా ఆనందించాం అందరం. నగరాల్లో ఉంటున్న మనకు ఇలాంటి అవకాశం ఎపుడో కాని రాదు. ఇంతకుముందు అమ్మమ్మ నాన్నమ్మల ఊళ్ళకు వెళ్ళేవాళ్ళం. ఈ రోజుల్లో మన అవసరాలకు వాళ్ళను ఇక్కడి కి తీసుకొని వచ్చేస్తున్నాము ఇక ఊళ్ళకు ఏం వెళ్తాం. అలా కాసేపు గడిపి మళ్ళీ ప్రయాణం మొదలెట్టాము.
11గం లకు శ్రీనివాసమంగాపురం చేరుకున్నాము. పెద్ద రద్దీ ఏం లేకపోవటంతో దర్శనం బాగా జరిగింది. ఆ మూర్తిని చూడగానే సాక్షాత్తూ ఆ తిరుమల శ్రీనివాసుని చూసినట్టే అనిపించింది నాకు. ఆ శ్రీనివాసుడు పద్మావతీ దేవి ని పెళ్లి చేసుకున్న తర్వాత 6 నెలలు ఇక్కడే ఉన్నాడట. ఆ తరువాత తిరుమల వెళ్ళాడట. కొంచెం సేపు అక్కడే ఉండి కపిలతీర్థం వెళ్ళాము. అక్కడ శివయ్య దర్శనం చేసుకున్నాం . బెంగళూరు మహానగరంలో తాగునీటి కే కరువు .ఆ తీర్థం లో ఆ నీళ్ళు చూడగానే పిల్లలు ఆనందంతో మునిగేసారు, ఎంతకీ బయటకి రాలేదు. అద య్యాక భోజనం చేసి ఇక నేరుగా తిరుమల కొండ ఎక్కేసాం. కొండ మీద బాగా రద్దీ ఉండటం వల్ల గదులు కొంచెం కష్టం గా దొరికాయి. ఆరోజు కి పడుకునేసాం బాగా అలిసిపోయి ఉండటంతో.
తెల్లవారి అంతా తలనీలాలు ఇవ్వటం, చిన్న పాపకు చెవులు కుట్టడం, ఆ తర్వాత దర్శనం అయ్యాక సహస్ర దీపాలంకరణ సేవ చూసి గది కి వచ్చేసాము. ఆ శ్రీనివాసుని చూడగానే కళ్ళు అరమోడ్పులై మనసు ప్రశాంతంగా అయింది తెలియని సంతోషం వేసింది. ముందు అబ్బా ఆ రద్దీ లో పిల్లలు తో రావటం అవసరమా అన్పిస్తుంది. స్వామి ని చూడగానే మళ్ళీ ఎప్పుడు వద్దాం ఎప్పుడు చూద్దాం ఇదే ఆలోచన కలుగుతుంది.
అక్కడ నుంచి కొండ దిగుతూ దారిలో జింకల పార్కు వద్ద ఆగాము. అవి మనల్నిచూడగానే మనమిచ్చే కీరా , కారెట్ ముక్కల కోసం గుంపుగా వచ్చాయి. పిల్లలు బాగా ఆడుకున్నారు వాటితో. వాటికి ఆహారం ఇవ్వడం కోసం ఒకతను వచ్చారు. అతను గేటు తీసేచప్పుడు వినగానే అలవాటు అయినట్టు గా జింకలు అన్నీఓ చెట్టు కిందికి వెళ్ళిపోయాయి.పిల్లలకి ఎంతో బాగుంది అక్కడ.
అక్కడ నుంచి కొండ దిగి అలిపిరి దగ్గర ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాం. ఆ గుడి పద్మం మీద నిలబడి నట్టుగా కట్టారు. గుడి లోపలికి వెళ్తే చిన్నికృష్ణయ్య రాధా గోపికలతో కలిసి ఎంతో అందంగా అలంకరించుకుని ఠీవిగా నిలబడి ఉన్నాడు మనసారా నన్ను తలచుకోండి మీ కోసం నేనున్నాను అన్నట్టుగా. అసలే శ్రీనివాసుని దర్శనం తో పులకించిన మనసు , ఆపై క్రిష్ణ దర్శనంతో చెప్పలేని అనుభూతి కలిగింది. ఇక అక్కడి ప్రసాదాల సంగతి తెలిసిందే కదా భలే ఉన్నాయి .ఎక్కువగా తీపి ప్రసాదాలు తీసుకున్నాం , ఇంకా తినాలనే కోరికను వదిలేసి తిరుగు ప్రయాణం మొదలెట్టాము. మద్యలో భోజనం కి మాత్రమే ఆగాం ఇంక కారు దిగి తిరిగే ఓపిక లేక. సాయంత్రానికి బెంగళూరు చేరిపోయాం.
అంతా వేంకటేశ్వర స్వామి దయ. స్వామిని పూజించే చేతులే చేతులట ఆమూర్తిని దర్శించే కనులే కన్నులట నిజమే కదా...
ఆ శ్రీనివాసుని దర్శన భాగ్యం దొరికింది అన్నమాట. మరల మరల ఇలాంటి ప్రశాంతమైన ఆనందకరమైన దర్శనము జరగాలని కోరుకుంటున్నాము. 👌👌
ReplyDeleteMee journey chaalaaa baavundi. Elaanti journey s appudu cheyalani manasaaraa korukontunnanu
DeleteThanks Murali
DeleteA vishalu cdutumte maku tirumala vellina anamdam kaligimdi
ReplyDeleteThank q...
DeletePinni super u r journey and u r poetry
ReplyDeleteThanks...
DeleteVery Nice
ReplyDelete