సర్దుబాటు
హాయ్ వల్లీ..........అంటూ నా ప్రాణ స్నేహితురాలిని పలుకరిస్తూ లోపలికి వెళ్ళా. హాల్లో లేదు ఎక్కడుందబ్బా అనుకుంటూ దొడ్లో కి వెళ్తే అక్కడ కూర్చుని ఉంది. నేను పిలిచినా వినిపించనంత ఆలోచన లో ఉంది. దగ్గరకెళ్ళి భుజం తట్టగానే ఉలిక్కిపడి ఆఁ అంటూ లేచింది. ఏంటే అంటే ఇపుడే పక్కింటి ఆవిడ వచ్చి తన బాధలు చెప్పుకుని వెళ్ళిందని.. ఆవిడ కొడుకూ కోడళ్ళ మధ్య ఏవో గొడవలనీ, విడాకులు తీసుకునేదాక వచ్చిందని బాధ పడిందట. ఏంటో రోజులు ఇలా అయిపోయాయి అని ఆలోచిస్తూ ఉండిపోయిందట. నిజానికి పరిస్థితులు అలాగే ఉన్నాయి. పక్కింటావిడ సమస్యే కాదు ఎక్కడ చూసినా ఇలాగే ఉంది వాతావరణం.
మొన్నీమధ్య ఓ పుస్తకం లో ఓ చిన్న కధ చదివాను. ఓ భార్య భర్త ఉంటారు, భర్త ఎపుడూ ఆమె కి సహాయం చేయటం కానీ, ఆమెను అర్థం చేసుకోవటం కానీ జరగలేదు. అలా కొన్నేళ్లు జరిగిన తరువాత ఆమెకు జబ్బు చేస్తుంది. ఎక్కువ కాలం బ్రతకదని డాక్టర్లు చెప్తారు . వాళ్ళింట్లో అన్ని వస్తువులు ఆయనకు తెలిసినవే కానీ, అటక మీద ఓ ట్రంకుపెట్టె ఉంటుంది అది మాత్రం చూడనివ్వలేదు ఆవిడ . ఇన్నాళ్లూ అందులో ఏముందో చూడాలని ఉన్నా ఎప్పుడూ చూడలేదు. ఇపుడు మాత్రం ఆగలేక అడుగుతాడు అందులో ఏముందీ అని. ఆవిడ సరే అని ఆ పెట్టె ను దించి చూడమంటుంది. మూత తీస్తే అందులో 2 స్వెట్టర్ లు 3,00000/రు డబ్బు ఉంటాయి. ఏంటి ఇవి అని అడిగితే ఆవిడ చెప్తుంది మన పెళ్ళి అయిన తరువాత కాపురానికి వచ్చేటప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది. నీకు ఎపుడైనా నీ భర్త మీద కోపం వస్తే స్వెట్టర్ అల్లు కోపం తగ్గిపోతుంది అని. అపుడు ఆయన నా మీద 2 సార్లు మాత్రమే కోపం వచ్చింది అని సంతోషపడతాడు. సరే ఈ డబ్బు ఏంటి అంటే, స్వెట్టర్లు అమ్మగా వచ్చిన డబ్బు అంటుంది ఆవిడ. అపుడు అర్ధం అయింది ఆయనకు ఆవిడ ఎంత బాధ పడిందో.. కానీ అప్పటికే ఆవిడ చివరి దశకు వచ్చి భగవంతుని దగ్గరకు వెళ్లి పోయింది. ఇన్నాళ్లు ఆవిడ ఎంత కష్టపడిందో ఎంత ఓర్పుతో సహనంతో కాపురాన్ని నెట్టుకొచ్చిందో ఆయనకు బాగా అర్థమవుతుంది.
భార్య భర్త ఇద్దరూ కొంచెం ఓర్పు, సహనం, సర్దుబాటు తో ఉంటే వాళ్ళ బంధం కలకాలం నిలిచి ఉంటుంది. దానివల్ల పిల్లలు ఆనందంగా ఉంటారు. అలా లేని పక్షంలో విడివిడిగా ఉండటం, విడాకులు తీసుకోవడం జరుగుతుంది. మనకు పంతం, పౌరుషం ఉన్నంత కాలం చేసిన పని సరైనదే అనిపిస్తుంది. పిల్లలు పెరిగి పెద్ద అయ్యేపుడు, తోటి పిల్లలు తల్లి తండ్రుల తో వస్తే అరే మనం ఎందుకు అలా రాలేకపోయామని అడిగినప్పుడు తెలుస్తుంది మనం చేసిన తప్పేంటో. అక్కడ దాకా వెళ్ళకుండా కొంచెం ఓర్పుతో నేర్పుతో కాపురాన్ని దిద్దుకుంటే బాగుంటుంది కదా. ఈరోజుల్లో చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు కారణం అవుతున్నాయి. భర్త ఫోన్ చూస్తున్నాడనో, భార్య త్వరగా ఇంటికి రాలేదనో ఇలాగా. ఇద్దరికీ సర్దుబాటు ఉంటేనే ఏగొడవ లేకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలరు. ఇంతా చెప్పేదేమిటంటే... చెయ్యి దాటిపోయాక చేసేందుకు ఏమీ ఉండదు. ముందు నేను చెప్పింది కధే కానీ అంతటి సహనం ఓర్పు ఉంటేనే కాపురాలు సజావుగా సాగుతాయి ఈరోజుల్లో.
Very nice. I dont treat it as a story. It is an eye opener to every one.
ReplyDeleteGood one and truthful story
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletePeople should take this story as a lesson and well narrated as well. If there is no mutual understanding, there won't be any happiness in life.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletewell said with the current trend
ReplyDelete