Posts

కాశీ యాత్ర

Image
                            ప్రతి మనిషి తన జీవితం లో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలని అనుకుంటాడు. కాశీ వెళ్ళాలంటే కాలభైరవుని ఆజ్ఞ కావాలి. ఆయన కాశీ క్షేత్రపాలకుడు. ఆయన అనుగ్రహంతో వెళ్ళినపుడే కాశీయాత్రా ఫలితం దక్కుతుంది. కాశీ క్షేత్రానికి వారణాసి అనే పేరు కూడా ఉంది కదా. కాశీలో ప్రవహించే గంగ కాశీ దగ్గర రెండు నదులతో సంగమిస్తుంది. ఒకటి వారుణ రెండు అసి. ఈ రెండు సంగమాల మధ్య                 ప్రవహించే గంగానదీ తీరమే కాశీ. అందుకే కాశీ వాసం చేసేపుడు ఈ ప్రాంతం దాటి వెళ్ళకూడదు అంటారు. కాశీ అనగానే మనం గంగాస్నానం చేసి విశ్వనాధ, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవులను దర్శించుకోవాలనుకుంటాము. కానీ కాశీ గురించి కొంచెం తెలుసుకుని భక్తిగా ఆ ఆలయాలను దర్శించుకుంటే సంపూర్ణ కాశీయాత్రా ఫలితాన్ని పొందవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి విశ్వనాధ లింగం. ఆజగన్మాత విశాలాక్షి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. కాశీ పట్టణానికి కరవు రాకూడదని సాక్షాత్తు పార్వతిదేవి అన్నపూర్ణగా వెలసింది. ఈ క్షేత్రంలో ఎందరో ఎంతో తపస్సు చేసి ముక్...

పెళ్లి నాటి ప్రమాణాలు

Image
  పెళ్ళి ఇది ప్రతి మనిషి జీవితంలోనూ జరిగే విషయమే . కాని ఆ పెళ్ళి విలువ , ఆ మంత్రాల అర్థాలు మనమెవరం తెలుసుకోము . తెలుసుకుంటే దంపతుల మధ్య ఇన్ని గొడవలు విడాకులు ఉండవేమో ! మన భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైనదీ పటిష్టమైనది . వరుడు విష్ణుస్వరూపుడుగా వధువు లక్ష్మీస్వరూపంగా భావించి వరుని కాళ్ళుకడిగి కన్యాదానం చేస్తాడు కన్యాదాత . భగవతత్త్వాన్ని ఆపాదించి చేస్తాం . కానీ దాన్ని పునాదులతో సహా కదిలించేస్తున్నాం . వివాహ   మంత్రాలకు అర్థం తెలిస్తే అయినా కనీసం వాటికి కట్టుబడి ఉంటామేమో . రెండు కుటుంబాల కలయిక , రెండు మనసుల కలయికే వివాహం . వధూవరుల పేర్లు , నక్షత్రాలు చూసి ముహుర్తం నిర్ణయిస్తారు . ఎందుకంటే ఆ ముహుర్తంలో ఒకటైనా జంట ఎప్పటకీ కలిసిమెలసి ఉంటారని అలా చేస్తారు . సుముహూర్తం : జీలకర్ర , బెల్లం కలిపి నూరిన ముద్దని ఒకరి తలపై ఇంకొరు బ్రహ్మరంధ్రాల మీద ఉంచేలా చేస్తారు . ఈ మిశ్రమం వల్ల ఒకరి శక్తి ఇంకొకరికి బ్రహ్మరంధ్రానికి ప్రవేశించి ఆ క్రిందనున్న సహస్రారచక్రానికి , అక్కడి నుండి ఆజ్ఞాచక్రానికి ...

భాగ్సా ఉత్సవం

Image
ధనుర్మాసం సందర్భంగా భక్త సులభుడైన ఆ శ్రీనివాసుని తలచుకుందామని  ఓ చిన్న ప్రయత్నం ఈ కధ.             అనంతాళ్వారులను తెలియని వారు ఉండరు. ఆ గోవిందుని భక్త పరంపరలో ఒకరు వారు. వారు తన భార్యతో  కలిసి ఎంతో కష్టపడి రామానుజ పుష్పవాటికలో ఎన్నో రకాల పూలచెట్లను నాటి రక రకాల పూలు పూయించారు. వాటినుంచి మంచి పూలను సేకరించి దండ కూర్చి స్వామి వారికి సమర్పించేవారు. స్వామి వారికి ఆ మాలలు బాగా నచ్చాయి.              ఈ మాలలే ఇంత అందంగా ఉంటే వీటిని పూయించే తోట ఇంక ఎంత అందంగా ఉందో చూడాలనిపించింది స్వామి వారికి. ఆరోజు అర్చకులు బంగారు వాకిళ్ళను మూసివేసి వెళ్ళిపోయాక స్వామి అలమేలు మంగమ్మ తో కలిసి ఆ తోట చూడటానికి వెళ్ళారు. ఆ తోటను అందులోని పూలను చూసాక పరవశించిపోయారు .తోటంతా తిరుగుతూ సరససల్లాపాలతో గడిపారు. ఆ పూల సువాసనకు పులకరించి కొన్ని పూలు వాసన చూసి పడేయడం, కొన్ని పూలు అమ్మవారి శిగలో తురమటం ఇలా చేస్తూ సుప్రభాతం వేళకి ఆనందనిలయం చేరుకున్నారు.             తెల్లవారాక పూలు కోద్దామని తోటకు వెళ్లిన ...

అమర్నాథ్ యాత్ర

Image
                 ఈమధ్య జరిగిన అమర్నాథ్ యాత్ర కు మా అల్లుడు గారు వెళ్ళారు .  ఎంతో ప్రశాంతంగా జరిగింది యాత్ర. నాకు  వెళ్ళాలని ఉన్నా ఆరోగ్యం సహకరించక వెళ్ళలేదు .   కాశ్మీర్ భూతల స్వర్గం అని ఎందుకు అంటారో శ్రీనగర్ చూస్తే    అర్థం అవుతుంది .  చుట్టూ ఎత్తైన మంచు కొండలు సూర్యోదయ వేళలో బంగారు రంగులో, మధ్యాహ్నం వేళ తెల్లగా, సాయంత్రం వేళకి నీలి రంగు లోకి మారి కనువిందు చేస్తాయి .  దారి ప్రక్కనే గల గలా పారుతున్న నదిలో    నీరు తెల్లని పాల నురగలాటుంది .  ప్రశాంతమైన వాతావరణంలో నదిలో పారుతున్న నీటి సవ్వడిని వింటుంటే మనసు లోని దిగుళ్ళన్నీ మాయమైపోయి ఎంతో హాయిగా ఉంటుంది .  ఆ మంచు కొండల పైనుంచి కిందికి దూకే జలపాతాన్ని చూస్తే శివుని జటాఝూటం  నుంచి దూకే గంగలా అనిపించకమానదు .  దూరంగా చూస్తే బారులు తీరిన సైనికుల్లా దేవదారు చెట్లు చూసేందుకు ఎంతో బాగుంటాయి .  దాల్ సరస్సు లో చిన్న పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగిన ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది .  ఫ్లోటింగ్ గార్డెన్స్ ఉంటాయి మధ్య మ...