Posts

Showing posts from April, 2022

కాశీ యాత్ర

Image
                            ప్రతి మనిషి తన జీవితం లో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలని అనుకుంటాడు. కాశీ వెళ్ళాలంటే కాలభైరవుని ఆజ్ఞ కావాలి. ఆయన కాశీ క్షేత్రపాలకుడు. ఆయన అనుగ్రహంతో వెళ్ళినపుడే కాశీయాత్రా ఫలితం దక్కుతుంది. కాశీ క్షేత్రానికి వారణాసి అనే పేరు కూడా ఉంది కదా. కాశీలో ప్రవహించే గంగ కాశీ దగ్గర రెండు నదులతో సంగమిస్తుంది. ఒకటి వారుణ రెండు అసి. ఈ రెండు సంగమాల మధ్య                 ప్రవహించే గంగానదీ తీరమే కాశీ. అందుకే కాశీ వాసం చేసేపుడు ఈ ప్రాంతం దాటి వెళ్ళకూడదు అంటారు. కాశీ అనగానే మనం గంగాస్నానం చేసి విశ్వనాధ, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవులను దర్శించుకోవాలనుకుంటాము. కానీ కాశీ గురించి కొంచెం తెలుసుకుని భక్తిగా ఆ ఆలయాలను దర్శించుకుంటే సంపూర్ణ కాశీయాత్రా ఫలితాన్ని పొందవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి విశ్వనాధ లింగం. ఆజగన్మాత విశాలాక్షి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. కాశీ పట్టణానికి కరవు రాకూడదని సాక్షాత్తు పార్వతిదేవి అన్నపూర్ణగా వెలసింది. ఈ క్షేత్రంలో ఎందరో ఎంతో తపస్సు చేసి ముక్...