పెళ్లి నాటి ప్రమాణాలు
పెళ్ళి ఇది ప్రతి మనిషి జీవితంలోనూ జరిగే విషయమే . కాని ఆ పెళ్ళి విలువ , ఆ మంత్రాల అర్థాలు మనమెవరం తెలుసుకోము . తెలుసుకుంటే దంపతుల మధ్య ఇన్ని గొడవలు విడాకులు ఉండవేమో ! మన భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైనదీ పటిష్టమైనది . వరుడు విష్ణుస్వరూపుడుగా వధువు లక్ష్మీస్వరూపంగా భావించి వరుని కాళ్ళుకడిగి కన్యాదానం చేస్తాడు కన్యాదాత . భగవతత్త్వాన్ని ఆపాదించి చేస్తాం . కానీ దాన్ని పునాదులతో సహా కదిలించేస్తున్నాం . వివాహ మంత్రాలకు అర్థం తెలిస్తే అయినా కనీసం వాటికి కట్టుబడి ఉంటామేమో . రెండు కుటుంబాల కలయిక , రెండు మనసుల కలయికే వివాహం . వధూవరుల పేర్లు , నక్షత్రాలు చూసి ముహుర్తం నిర్ణయిస్తారు . ఎందుకంటే ఆ ముహుర్తంలో ఒకటైనా జంట ఎప్పటకీ కలిసిమెలసి ఉంటారని అలా చేస్తారు . సుముహూర్తం : జీలకర్ర , బెల్లం కలిపి నూరిన ముద్దని ఒకరి తలపై ఇంకొరు బ్రహ్మరంధ్రాల మీద ఉంచేలా చేస్తారు . ఈ మిశ్రమం వల్ల ఒకరి శక్తి ఇంకొకరికి బ్రహ్మరంధ్రానికి ప్రవేశించి ఆ క్రిందనున్న సహస్రారచక్రానికి , అక్కడి నుండి ఆజ్ఞాచక్రానికి ...