Posts

Showing posts from September, 2019

అమర్నాథ్ యాత్ర

Image
                 ఈమధ్య జరిగిన అమర్నాథ్ యాత్ర కు మా అల్లుడు గారు వెళ్ళారు .  ఎంతో ప్రశాంతంగా జరిగింది యాత్ర. నాకు  వెళ్ళాలని ఉన్నా ఆరోగ్యం సహకరించక వెళ్ళలేదు .   కాశ్మీర్ భూతల స్వర్గం అని ఎందుకు అంటారో శ్రీనగర్ చూస్తే    అర్థం అవుతుంది .  చుట్టూ ఎత్తైన మంచు కొండలు సూర్యోదయ వేళలో బంగారు రంగులో, మధ్యాహ్నం వేళ తెల్లగా, సాయంత్రం వేళకి నీలి రంగు లోకి మారి కనువిందు చేస్తాయి .  దారి ప్రక్కనే గల గలా పారుతున్న నదిలో    నీరు తెల్లని పాల నురగలాటుంది .  ప్రశాంతమైన వాతావరణంలో నదిలో పారుతున్న నీటి సవ్వడిని వింటుంటే మనసు లోని దిగుళ్ళన్నీ మాయమైపోయి ఎంతో హాయిగా ఉంటుంది .  ఆ మంచు కొండల పైనుంచి కిందికి దూకే జలపాతాన్ని చూస్తే శివుని జటాఝూటం  నుంచి దూకే గంగలా అనిపించకమానదు .  దూరంగా చూస్తే బారులు తీరిన సైనికుల్లా దేవదారు చెట్లు చూసేందుకు ఎంతో బాగుంటాయి .  దాల్ సరస్సు లో చిన్న పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగిన ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది .  ఫ్లోటింగ్ గార్డెన్స్ ఉంటాయి మధ్య మ...