సర్దుబాటు
హాయ్ వల్లీ..........అంటూ నా ప్రాణ స్నేహితురాలిని పలుకరిస్తూ లోపలికి వెళ్ళా. హాల్లో లేదు ఎక్కడుందబ్బా అనుకుంటూ దొడ్లో కి వెళ్తే అక్కడ కూర్చుని ఉంది. నేను పిలిచినా వినిపించనంత ఆలోచన లో ఉంది. దగ్గరకెళ్ళి భుజం తట్టగానే ఉలిక్కిపడి ఆఁ అంటూ లేచింది. ఏంటే అంటే ఇపుడే పక్కింటి ఆవిడ వచ్చి తన బాధలు చెప్పుకుని వెళ్ళిందని.. ఆవిడ కొడుకూ కోడళ్ళ మధ్య ఏవో గొడవలనీ, విడాకులు తీసుకునేదాక వచ్చిందని బాధ పడిందట. ఏంటో రోజులు ఇలా అయిపోయాయి అని ఆలోచిస్తూ ఉండిపోయిందట. నిజానికి పరిస్థితులు అలాగే ఉన్నాయి. పక్కింటావిడ సమస్యే కాదు ఎక్కడ చూసినా ఇలాగే ఉంది వాతావరణం. మొన్నీమధ్య ఓ పుస్తకం లో ఓ చిన్న కధ చదివాను. ఓ భార్య భర్త ఉంటారు, భర్త ఎపుడూ ఆమె కి సహాయం చేయటం కానీ, ఆమెను అర్థం చేసుకోవటం కానీ జరగలేదు. అలా కొన్నేళ్లు జరిగిన తరువాత ఆమెకు జబ్బు చేస్తుంది. ఎక్కువ కాలం బ్రతకదని డాక్టర్లు చెప్తారు . వాళ్ళింట్లో అన్ని వస్తువులు ఆయనకు తెలిసినవే కానీ, అటక మ...