Posts

Showing posts from April, 2019

నా తిరుమల ప్రయాణం

Image
                    మా చిన్న   మనవరాలికి పుట్టువెంట్రుకలు తీయించాలని మా కుటుంబం అంతా కలిసి బెంగళూరు నుంచి ఉదయం 5.30 గంలకు కారులో బయలుదేరాము . హొసకోట దాటేసరికి సూర్యోదయం అయింది . ఎంత బాగుందో అనుకుంటూ వెళ్తూంటే దారికిరుప్రక్కల ద్రాక్ష తోటలు , బంతి పూల తోటలు , కూరలతోటలు కనువిందు చేస్తూ కనిపించాయి . చెప్పొద్దూ ... కాస్త ఆగి మమ్మల్ని చూసి వెళ్ళండి అని పిలిచినట్టే   అనిపించింది నాకు . ఇక పిల్లలు చెప్పాలా .. దిగేశాం . ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం . ఆ తోటలు చూసి బాగా ఆనందించాం అందరం . నగరాల్లో ఉంటున్న మనకు ఇలాంటి అవకాశం ఎపుడో కాని రాదు . ఇంతకుముందు అమ్మమ్మ నాన్నమ్మల ఊళ్ళకు వెళ్ళేవాళ్ళం . ఈ రోజుల్లో మన అవసరాలకు వాళ్ళను ఇక్కడి కి తీసుకొని వచ్చేస్తున్నాము ఇక ఊళ్ళకు ఏం వెళ్తాం . అలా కాసేపు గడిపి మళ్ళీ ప్రయాణం మొదలెట్టాము .                                           11 గం లకు శ్రీనివాసమంగాపురం చేరుకున్నాము . పెద్ద ...