Posts

Showing posts from December, 2018
"తృప్తి".                                    (గెలిచిన పందెం) గుర్రాన్ని అమ్మడానికి వేటగాడు సంతకు వెళ్ళాడు. బేరం కుదరక గుర్రాన్ని ఇచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిద కు మారకం వేశాడు. అదీ కుదరక గాడిదనిచ్చి బూట్లు కొన్నాడు. అదీ కుదరక బూట్లు ఇచ్చి టోపీ కొన్నాడు. ఆ టోపీ తో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తూ ఉంటే రాయి తగిలి బోర్లా పడ్డాడు. టోపీ కాస్తా నది లో పడిపోయింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే బాటసారులు విషయం అడిగి తెలుసుకుని అయ్యో పాపం అని బాధ పడ్డారు. " నీకివాళ ఉపవాసమే " అన్నాడొకడు. పెళ్ళాం చేత " బడితే పూజ" తప్పదన్నాడింకొకడు. వేటగాడు నా భార్య అలాంటిది కాదు, ఏమీ అనదు అని బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురూ వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మం లోంచి భార్య ని పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా వచ్చావా అంది ఆప్యాయంగా. వాడు జరిగింది చెప్పటం మొదలెట్టాడు. వేటగాడు: గుర్రం ధర పలకకపోతే ఆవు కు మారకం వేశా అన్నాడు. భార్య: మంచి పని చేసావు పాలు...